కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం.

* దుర్గమ్మ గుడి స్థల వివాదము పరిష్కరించినందుకు వర్షం * చిత్రపటానికి పాలభిషేకం, చెట్టుకు కలెక్టర్ పేరు నామకరణం.

పయనించే సూర్యుడు, జూన్ 12, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి భూమి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న గందరగోళానికి చరమగీతం పాడుతూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మోటివేషన్ రద్దు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు ఆధ్వర్యంలో బచ్చన్నపేట నాయకులు, పలు ప్రజాసంఘాల నాయకులు జనగామ కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గుడి ప్రాంగణంలో ఉన్న యాప చెట్టు,రాగి చెట్టులకు కలెక్టర్ పేరు నామకరణం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ 1966లో గ్రామపంచాయతీకి ప్రజా ప్రయోజనాల కోసం దానం చేసిన భూమిపై జరిగిన అక్రమ మ్యూటేషన్ ప్రక్రియలో వాస్తవాలపై విచారణ జరగగా భూమిని ప్రభుత్వ భూమి గ్రామపంచాయతీకి నమోదు చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గమ్మ గుడి స్థలాన్ని కాపాడడానికి ఆ తల్లి వారిని కలెక్టర్ రూపంలో పంపిందని వారు అన్నారు. గుడి వద్ద గ్రామస్తులు అందరూ కలిసి కలెక్టర్ చిత్రానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొని బాలకిషన్ గౌడ్, కొండి వెంకటరెడ్డి, మహమ్మద్ మసూద్,మహమ్మద్ గౌస్, బొమ్మెన ఆంజనేయులు, గిరబోయిన బాల సిద్ధులు, కుమ్మరి కేశయ్య, పురాణం శ్రీనివాస్, మోహన్ రెడ్డి, మచ్చ నరేందర్, చిలుముల సుధాకర్ రెడ్డి, కూరెల్ల వెంకటరెడ్డి, కర్రే రాజు, గుంటుపల్లి హరి, వార్డ్ మెంబర్లు కర్రె ప్రశాంత్, కక్కెర్ల విజయ్, ముద్దసాని అనిల్, కక్కర్ల భవాని, వివిధ కుల సంఘాల నాయకుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *