రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీ.ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు

పయనించే సూర్యుడు, జూన్ 06 రంగారెడ్డిజిల్లాప్రతినిధి (ఎస్ఎంకుమార్) రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు పూర్తి రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ తరుపున చేసిన వినతికి స్పందించిన డిఈఓ 50 శాతం రాయితీ ఇవ్వాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఏలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పనిచే స్తున్న జర్నలిస్టులకు ప్రయివేటు పాఠశాలలో పిల్లల చదువులకు ఫీజు లు భారంగా మారాయని జిల్లా కలెక్టర్ తో పాటు డిఈఓ దృష్టికి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి సలీమ్ పాషా నేతృత్వంలోని బృందం గురువారం నాడు తీసుకెళ్లటంతో ఈ మేరకు జిల్లా విద్యాధికారి శుక్రవారం నాడు ఉత్తర్వు లు ఇచ్చారు.ఉత్తర్వు కాపీలను డి ఈ ఓ వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా కు అందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డికి,అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి,డి ఈ ఓ వెంకటేశ్వ ర్లు కు జిల్లా అధ్యక్షులు సలీమ్ పాషా ధన్యవాదాలు తెలిపారు.ఈ ఆదేశాలు అన్ని పాఠశాలల్లో వర్తించేలా చూడా లని కోరారు.ఈ మేరకు ఆయా మండ లాల ఎంఈఓ లకు కుడా సూచి స్తామని, ఉత్తర్వు కాపీలను పంపిస్తామని తెలిపా రు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు మారాటీ రవి,జర్నలిస్ట్ నేతలు కరుణా కర్, భాస్కర్ భార్గవ్,శ్రీనివాస్,శివ తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *