పయనించే సూర్యుడు, మే 28 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది,ఎండ దెబ్బ (హట్ స్ట్రోక్) ప్రాణాపాయం కలిగించవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించి, మీరు మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోండి.ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగినంత నీరు తాగండి రోజంతా తరచుగా ఓఆర్ఎస్, జ్యూస్ , మజ్జిగ, కొబ్బరి నీరు తాగండి.తేలికపాటి, లైట్ కలర్ బట్టలు ధరించండి,పత్తి బట్టలు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.ఎండ ఎక్కువగా ఉండే సమయం మధ్ధాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లేకండి.తేలికపాటి ఆహారం తీసుకోండి, వేపుడు, మసాలా ఆహారం తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.తల, ముఖాన్ని కప్పుకోండి,టోపి, గొడుగు ఉపయోగించండి,చెట్ల నీడలో విశ్రాంతి తీసుకోండి,శారీరక శ్రమ, వ్యాయామం చేయడం తగ్గించండి.
.
ఎండదెబ్బ లక్షణాలు గమనించండి
తలనొప్పి,చెమట పట్టడం ,తల తిరగడం , వాంతులు,అలసట, శరీర ఉష్ణోగ్రత పెరగడం,ఈ లక్షణాలు కనిపిస్తే. వెంటనే చల్లట్టి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి, నీరు/ ఓ ఆర్ ఎస్ ఇవ్వండి . పరిస్థితి తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్య సహాయం పొందండి.అత్యవసర సహాయం కోసం 100 కు డయల్ చేయండి.మీ ఆరోగ్యం – మీ బాధ్యత | జాగ్రత్త పడండి – ఆరోగ్యంగా ఉండండి.అలాగే ప్రస్తుతం రైతులు పంట కోత అనంతరం మిగిలిన పంట అవశేషాలను తొలగించేందుకు చేన్లలో మంటలు పెడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ విధంగా మంటలు పెట్టడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మరియు రైతులకే తీవ్ర నష్టాలు కలుగుతున్నాయి.పంట అవశేషాలకు మంటలు పెట్టడం వలన భూమిలోని సారవంతమైన సూక్ష్మజీవులు నశించి, నేల సారత్వం తగ్గిపోతుంది. అదేవిధంగా గాలిలో పొగ మరియు హానికర వాయువులు వ్యాపించి వాయు కాలుష్యం పెరుగుతుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, కంటి సమస్యలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.అలాగే చేన్లలో పెట్టిన మంటలు అదుపుతప్పి సమీపంలోని పంట పొలాలు, గడ్డి మోపులు, విద్యుత్ తీగలు, చెట్లు మరియు ఇళ్లకు వ్యాపించి అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. కొన్నిసార్లు ఈ మంటలు రహదారులు మరియు రైలు మార్గాల వరకు వ్యాపించి ప్రమాదాలకు కారణమవుతాయి.కాబట్టి రైతులు పంట అవశేషాలను కాల్చివేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించాలని, వాటిని ఎరువుల తయారీకి లేదా పశువుల మేతగా వినియోగించాలని సూచించడమైనది. ప్రతి రైతు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరడమైనది.