మహిళా సంఘాల బలోపేతానికి కార్యాచరణ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్,మే 28 మామిడిపెల్లి లక్ష్మణ్ మండలంలోని సెర్ప్ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ధనలక్ష్మి మండల సమైక్య సర్వసభ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ సంఘ భవనాల నిర్మాణాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు, మహిళా శక్తి చీరల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, మండల సమైక్యకు ఆర్టీసీ బస్సు కేటాయింపు, బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీలేని రుణాలు, స్త్రీనిధి రుణాలు, ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు, ఎంటర్‌ప్రైజెస్‌, రికవరీ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, స్నేహ సంఘాలు, వృద్ధ మహిళా సంఘాలు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, కొత్త మహిళా సంఘాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి సంబంధించిన అక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున, ఏపీఎం నరహరి, సీసీలు లావణ్య,గంగారం, మండల సమైక్య అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి, వివిధ గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *