బక్రీద్ సందర్భంగా పరిశుభ్రత చర్యలు… ముస్లిం సోదరులకు ప్లాస్టిక్ కవర్ల పంపిణీ

పయనించే సూర్యుడున్యూస్ :- మే 28 భీమ్గల్ మండల ప్రతినిధి కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో గురువారం జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా పట్టణంలో పరిశుభ్రతను కాపాడేందుకు ముస్లిం సోదరులకు ప్లాస్టిక్ కవర్లు పంపిణీ చేశారు. పండుగ అనంతరం వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ప్లాస్టిక్ కవర్లలో సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. తప్పనిసరిగా మున్సిపల్ వాహనంలోనే వ్యర్థాలను వేయాలని, మున్సిపల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ లు బోదిరే స్వామి, జై జై నర్యయ్య, అంజుమ్ అలీ, తోట సతీష్, సందీప్, సంగ్యా నాయక్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *