టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా కొండ్లెపు అర్జున్ నియామకం

పయనించే సూర్యుడు,కోరుట్ల మే 28. రాష్ట్ర సెక్రటరీగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన కొండ్లెపు అర్జున్ మోచిని నియమిస్తూ రాష్ట్ర పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నిన్న ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతమ్ నియామక పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండ్లెపు అర్జున్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎస్సీ ఉపకులాలను గుర్తిస్తూ తనను రాష్ట్ర సెక్రటరీగా నియమించడం చారిత్రాత్మకమని అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ బలోపేతం కోసం కృషి చేస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *