పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 28 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు వ్యసాయ మార్కెట్ యార్డ్ లో కాంగ్రెస్ మొండి వైఖరి మానుకొని వెంటనే వోడ్లో కొనుగోలు చేయాలనీ బుధవారం రోజున ధర్నా నిర్వహించరూ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులు ఆరుగాలం శ్రమించి తమ పంటలను కొనమని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనడం లేదని రైతులు కన్నీరు కారుస్తుంటే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు మాత్రం దోచుకోవడానికి కలెక్టర్ ఆఫీసులు ఎమ్మార్వో ఆఫీస్ లో చుట్టూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి పైరవీలు అవినీతి అక్రమాలు భూకబ్దాలు చేసి పాలనను గాడికి వదిలేసి రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులకు రైతులు యొక్క గోస పట్టదు అన్నారు, గజ్వేల్ నియోజకవర్గం లో ఇప్పటికి 30% వడ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనలేదు అని ఇంకా 70% వడ్లు ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్నాయి అని వెంటనే ఆ వడ్లను కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు పంపించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. దొంగే దొంగ అన్నట్టుగా వడ్లను కొనుగోలు చేయమంటే కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగల్ డిపాజిట్ కూడా రాదు అన్నారు రేవంత్ రెడ్డి డిపాజిట్ కూడా గవల్లంతవ్వడం ఖాయమన్నారు. రైతుల పంటలు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పగటి దొంగలను గ్రామాల తిరుగనీయకుండా రైతులు అడ్డుకోవాలని రైతులకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వడ్లను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో , మరియు రైతన్నలతో కలిసి రైతు దీక్ష కార్యక్రమం చేపట్టిన గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రైతు దీక్ష అనంతరం తడిసిన వరి ధాన్యం ను, మరియు ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వరి ధాన్యం ను వెంటనే కొనుగోలు చేయాలని గజ్వేల్ ఆర్ డి ఓ గారికి రైతుల పక్షాన వినతి పత్రం అందించారు. 45 డిగ్రీల ఎర్రటి ఎండలో రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించి నిలగడుస్తున్న ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒకటి రెండు లారీల కంటే వరి ధాన్యం కొనుగోలు చేయలేదని, రైస్ మిల్లర్లకు పంపలేదని అన్నారు దాదాపు గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 120 కి పైగా వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఒక్కో వడ్ల కొనుగోలు కేంద్రంలో దాదాపు 40 లారీల నుండి 50 లారీల వరకు వరి ధాన్యం ఉందన్నారు వెంటనే రాబోయే నాలుగైదు రోజులలో ఆంక్షలు లేకుండా, మ్యాచార్ లేకుండా, తరుగు తీయకుండా , నిన్నటి వర్షాలకు తడిసిన వారి ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు, అంతేకాకుండా రైతులకు గన్ని బ్యాగులను ట్రక్కులను అందుబాటులోకి ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాజీవ్ రహదారులను గ్రామ గ్రామాన వేలాది మంది రైతులతో కలిసి దిగ్బందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించారు . గతంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వెన్నెముకగా నిలిచిందన్నారు, రైతులు పండించిన పంటలను సకాలంలో కొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచి లారీలను ట్రాక్టర్లను అందుబాటులో ఉంచి వర్షాకాలం రాకముందే రైతుల పంటలను రైస్ మిల్లర్లకు తరలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత గతంలోని కేసీఆర్ ప్రభుత్వానిది అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి దీక్షలు ధర్నాలు కొత్తవి కావు అన్నారు నీళ్ల కోసం కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో పాడి పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు.
కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలకు కేసీఆర్ విమర్శించే నైతిక హక్కు లేదన్నారు
గత కేసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశనికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దరిద్రాన్ని ఇంకా రెండేళ్లు భరించాలని ఎద్దేవా చేశారు.
రైతుల కళ్ళల్లోకి బిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్ల కొనుగోలు చేయమని తిరుగుతా ఉంటే కాంగ్రెస్ దద్దమ్మ నాయకులు మాత్రం పైరవీలు చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వెంటనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి తడిసిన ధాన్యం తో పాటు ఐకెపి సెంటర్లో ఉన్న వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున రాజీవ్ రహదారుల దిగ్భంధంతో రైతుల పక్షాన ఉద్యమిస్తామని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు