మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న చల్లా బాబురెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 28.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా వర్గం ప్రతి ని ది జె. నాగరాజ// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ విధానంలో మహానాడు కార్యక్రమం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు నారా లోకేష్ బాబు ,రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా చల్లా బాబు రెడ్డి వారి ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండలాలలో మహానాడు కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పులిచెర్ల మండలంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమములో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జివర్యులు చల్లా రామచంద్రారెడ్డి ( చల్లా బాబు రెడ్డి) పులిచెర్ల పట్టణం నందు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి మహానాడు ప్రాంగణం వరకు వందలాది స్కూటర్లతో ర్యాలీ నిర్వహించారు. సభా ప్రాంగణానికి చేరుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు వారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమాన్ని వీక్షించిన చల్లా బాబురెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *