పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ మే 29/26 బెతలపాడు గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు మరణం సిపిఐ పార్టీకి తీరనిలోటని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ అన్నారు చలమల సత్యం (72 ) భౌతికకాయంపై పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు గ్రామంలో సిపిఐ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేశారని ఆయన అన్నారు వారి కుటుంబానికి సిపిఐ పార్టీ ఎల్లప్పుడు అండ దండలుగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎల్లంకి మధు గార్లపాటి వీరభద్రం చలమల బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు