పయనించే సూర్యుడు న్యూస్ జులై 04, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని గోనెగండ్ల మండల మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. _ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత పరిస్థితులు, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల భాగస్వామ్యం, రానున్న రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది. మండలంలోని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని, ప్రజల్లో పార్టీపై విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని అరుణమ్మ సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరికీ సమన్వయంతో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించినట్లు అరుణమ్మ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారని పేర్కొన్నారు. ఈ భేటీ అత్యంత సానుకూల వాతావరణంలో సాగిందని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలోపేతం, మహిళా విభాగం క్రియాశీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై నిర్మాణాత్మకంగా చర్చించినట్లు అరుణమ్మ వెల్లడించారు.