మండలంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

* తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఎన్టీఆర్ * నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామి దొర

పయనించే సూర్యుడు న్యూస్ మే 29 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంస్థానిక రోడ్డు సెంటర్ నందు గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు అల్పాహారంగా పులిహార. మజ్జిగను అందజేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి టిడిపి నాయకులు మాట్లాడుతూ శక పురుషుడు నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని పార్టీని స్థాపించిన ఎనిమిది నెలలలోనే ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం పేదవారికి ఎంతో ఉపయోగపడిందని రాజకీయాలతో పాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోశారన్నారు. రాముడు, భీముడు, కృష్ణుడు ఇలా ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించేవారని, ఆయా పాత్రలను కళ్లకు కట్టినట్లుగా చూపేవారని చెప్పుకొచ్చారు. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లు నిజంగా ఇలాగే ఉండేవారేమో అన్న రీతిలో ఆయన నటన ఉండేదని. ప్రపంచంలో తెలుగుజాతి ఉన్నం వరకు.. ఎన్టీఆర్ పేరు ఖ్యాతిగడిస్తుందని చెప్పారు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్థానం సజీవం, సుస్థిరం అని అన్నారు దిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా దిల్లీ దాకా చాటారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినిమాలలో ఖ్యాతిని గడించారు కోట్ల మంది హృదయాలలో నిలిచిపోయారు 300కు పైగా చిత్రాల నటించి అలరించారు అటు సినిమా.. ఇటు రాజకీయ రంగంల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి భారతరత్న బిరుదుని ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో. నియోజవర్గ ఇన్చార్జి కట్రం స్వామి దొర . మండల పార్టీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాసరావు. అంకోలు వెంకటేశ్వరావు సుంకవల్లి వీరభద్ర రావు పానుగంటి సాంబశివరావు తలసీల ప్రసాద్ నర్రా రాకేష్ యువ నాయకులు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *