చేజర్లలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు

పయనించే సూర్యుడు మే 29 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మహానాడు రొండో రోజు శుభ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి సూచనల మేరకు మండల కేంద్రమైన చేజర్లలో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గురువారం ఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టిడిపి పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు వేదికపై భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, టిడిపి మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, సోమశిల 24ఎల్ కాలువ అధ్యక్షుడు ఉడత హజరతయ్యతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *