ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన,

పర్యావరణ పరిరక్షణపై ఆదోనిలో జిల్లా స్థాయి కార్యాశాల

పయనించే సూర్యుడు మే 30 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఎస్‌ఐఆర్ (ఎస్ ఐ ఆర్) ప్రాముఖ్యతపై జిల్లా స్థాయి కార్యాశాల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ… మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలోనూ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, గత 12 ఏళ్ల పాలనలో పేద సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టాయని కొనియాడారు. కార్యక్రమంలోనిముఖ్యాంశాలు:సుపరిపాలన: మోదీ పాలనలో అవినీతి రహిత, పారదర్శక పాలన ప్రజలకుచేరువయింది.పర్యావరణ పరిరక్షణ: ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని కొనసాగించడం మరియు చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రపంచ యోగ దినోత్సవం: యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత మోదీకే దక్కుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అదే విధంగా ఎస్ ఐ ఆర్ కు సంబంధించిన అని విషయాలు, జాగ్రత్తలు అదే విధంగా బి ఎల్ ఓ ల విధి విధానాలు గురించి క్లుప్తంగా తెలియజేశారు..ఈ కార్యక్రమం లో బీజేవైఎంరాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ, రాష్ట్ర ,జిల్లా,అసెంబ్లీ,మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *