పయనించే సూర్యుడు మే 30 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చేన్నారావుపేట మండలం లింగగిరి గ్రామం చెన్నారావుపేట మండలం లింగగిరి లో తాటి చెట్లను కావాలనే దగ్ధం చేసిన కడగండ్ల పెద్ద యాకయ్య ఫై కేసు నమోదు చేయాలనీ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. లింగగిరి గ్రామంలో ఉన్న తాటి వనాన్ని యాకయ్య అనే వ్యక్తి తగులబెట్టడంతో సుమారు 20 తాటి చెట్లు పూర్తిగా కాలిపోయా యని ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిన తాటి వనాన్ని గౌడ కులస్తులతో కలిసి శుక్రవారం పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా మోకుదెబ్బ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యా ప్తంగా గౌడ కులస్తులకు జీవ నాదారమైన తాటి,ఈత చెట్లను కాంట్రాక్టర్లు,రియల్ ఎస్టేట్ వ్యాపా రులు,భూస్వాములు ఇష్టా రీతిన నరికి వేయడం,దగ్ధం చేయ డం చేస్తున్నారని రమేష్ గౌడ్ ఆరోపిం చారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం ముజుకూరు గ్రామంలో వెయ్యి ఈత చెట్లను జేసీబీ సహా యంతో ఓజ్జమ్ భూమేష్ తొల గించ్చాడాన్నారు.హన్మకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో 1000,శనిగరంలో 200,గునిపర్టిలో 800 తాటి,ఈత చెట్లు అగ్ని కి ఆహతయ్యాయ న్నారు.లింగగిరి లో యాకయ్య కావాలనే తాటి చెట్లకు నిప్పంటిం చించడం జరిగిందన్నారు. సొంత భూమిలో ఉన్న తాటి,ఈత చెట్ల ను నరకాలంంటేఆబకారి,రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం. అలాంటిది ఎవరి అనుమతి లేకుండా 20 తాటి చెట్లను యాకయ్య దగ్ధం చేయడం దారుణమైన చర్య అని అన్నారు.ఈ ప్రమాదం కారణంగా వాటి మీద ఆధారపడి బతుకుతున్న గౌడ కులస్థులు తమ జీవనోపాధిని కోల్పోయారన్నారు.ఈ విషయమై ఇప్పటికే స్థానిక పోలీసులకు,అబ కారి శాఖ అధికారులకు రాతపూ ర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా ఆబకారి శాఖ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని,నష్ట పోయిన గీత కాత్మికులకు న్యాయం చేయాలని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ చెన్నారావు పేట మండల అధ్యక్షులు గోడిశాల మల్లయ్య గౌడ్,లింగగిరి గౌడ సంఘం అధ్యక్షులు పులి రమేష్ గౌడ్,ఉపాధ్యక్షులు బూర్గు శ్రీనివాస్, అమీనాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు అంబాల శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షులు బూడిద చిన్న వెంకటేశ్వర్లు గౌడ్,పూజరి శ్రీనివాస్ గౌడ్,డైరెక్టర్లు గంగపురపు వెంకన్న, పులి అశోక్ గౌడ్,పరకాల రాజన్న గౌడ్,సట్ల నవీన్ గౌడ్,గట్టు వెంకటేశ్వర్లు గౌడ్,సప్పిడి సాగర్ గౌడ్,గట్టు ఎల్లాగౌడ్,పులి శోభన్ గౌడ్,మంద అఖిల్ గౌడ్,పులి సుమన్ గౌడ్,విలాసారాపు ఎల్లా గౌడ్,గంగాపురపు రాంబాబు గౌడ్,బొల్లెపెల్లి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.