వెంకటాపూర్ లో ఘనంగా ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి’ కార్యక్రమం

పయనించే సూర్యుడు మే 30 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం (కొట్టాలగడ్డ​)వెంకటాపూర్ గ్రామంలో ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి’ కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈవెంట్ ఆర్గనైజర్లు బాలస్వామి, మలికేడి లక్ష్మణ్ మరియు రాము గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బద్దిపల్లి నరసింహారెడ్డి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాలను గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని, సౌరశక్తి ద్వారా కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని పిలుపునిచ్చారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు గ్రామ వార్డు మెంబర్లు మానుపాడు రమేష్, చిక్కండ్ర జగన్మోహన్ మరియు గ్రామ ప్రముఖులు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పథకం విశేషాలను ప్రజలకు వివరించిన ఆర్గనైజర్ల చొరవను గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *