ఉమామహేశ్వరరావు పెళ్లిరోజు సందర్భంగా…

బాలపేట గ్రామంలో ఈజీఎస్ కూలీలకు మజ్జిగ పంపిణీ ...

పయనించే సూర్యుడు న్యూస్ :మే 30, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం బాలపేట గ్రామంలో ఆ గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చిట్టెం నరసింహారావు రమాదేవి దంపతుల కుమారుడు చిట్టెం ఉమా మహేశ్వరరావు పెళ్లిరోజు పురస్కరించుకొని గ్రామంలో ఈజీఎస్ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ కోసూరి ధనలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ వేసవికాలం దృష్ట్యా, ఎండలు అధికమవడంతో కూలీల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టిన మహేశ్వరరావు నిజంగా అభినందనీయడని. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్నలను పొందు కోవాలని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆ గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కోసూరి వెంకట నరసింహారావు, బిఆర్ఎస్ నాయకులు చిట్టెం నరసింహారావు,మజ్జిగ వితరణ దాత చిట్టెం ఉమామహేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ పూర్ణకంటి వెంకటేశ్వరరావు,వార్డు మెంబర్ గొడ్ల వెంకటేశ్వర్లు,ఆ పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల పుల్లయ్య,యువజన నాయకులు తాటి నాగరాజు, నరసింహారావు, రమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *