మంచినీటి సరఫరా చేయలేని అసమర్థత ప్రభుత్వం, మంచినీటి సరఫరా చేస్తున్న ప్రతిపక్షం

ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటున్న బుట్టా ఫౌండేషన్

పయనించే సూర్యుడు న్యూస్ మే 31-2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి పట్టించుకోని అధికార పార్టీ నాయకులు, ప్రతి ఇంటికి అవసరమయ్యేది మొదటగా, త్రాగునిరు అలాంటి దానిపై నిర్లక్ష్యం చేసి మా ప్రభుత్వం, పింఛన్లు పెంచాం, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్సు, తల్లి వందనం ఇస్తున్న, అలాగే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి సమానంగా కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తున్నామని, గొప్పలు చెప్పుకోవడం తప్పనిస్తే, ప్రజానీకానికి నిత్యవసరమైన త్రాగునీటిని అందించలేకపోతున్న ప్రభుత్వం, ఇదేనా మీ అభివృద్ధి అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గ్రామంలో నాయకులు గాని, సంబంధిత పంచాయతీ అధికారి ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, గ్రామ ప్రజలు వేసవి కాలంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు చూసి వై సి పి యువ నాయకులు వడ్ల నరసింహ ఆచారి, దాసన్న రమేష్ గ్రామ ప్రజల తరఫున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యల పట్ల ఎల్లప్పుడూ స్పందించే బుట్టా రేణుకమ్మ వెంటనే ఈ విషయాన్ని బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న వెంటనే స్పందించిన బుట్టా శివ నీలకంఠ బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంజహళ్లి గ్రామానికి మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేపట్టించారు. దీంతో గ్రామ ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తమ సమస్యను వెంటనే గుర్తించి స్పందించిన బుట్టా రేణుకమ్మ అలాగే సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ కు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా ప్రజా సేవ చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆమెకు రాజకీయంగా మా మద్దతుగా నిలబడుతామని, అధికారం లేకున్నా సమస్యపై స్పందించి ఆమె ప్రజలు అధికారమిస్తే ఇలాంటి సేవ కార్యక్రమాలు మరెన్నో చేయగలరాని, ప్రజలకు కావాల్సింది ఇలాంటి నాయకురాలేనని ఇలాంటి వారికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *