“ఉపాధి”స్థానంలో వీబీ-జీ రామ్ జీ.

జులై 1 నుంచి వీబీ-జీ రామ్ జీ

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మే.31.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం దేవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పోతవరం గ్రామంలో జలధార (జలహారతి) కార్యక్రమంలోఅత్తవారి చెరువు.కామేష్ (డి.ఏ టెక్నిక్ ఆఫీసర్) మాట్లాడుతూ…’మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం'(ఎంజీనరేగా) ను రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోర్ గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ-జీ రామ్ జీ) ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ఈ కొత్త చట్టాన్ని జులై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇది గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్ధమైన వేతన ఉపాధికి హామీ ఇస్తుందని తెలియజేశారు.జీవననోపాధి భద్రత,గ్రామీణ ప్రజలకు ఆదాయ కల్పన,మౌలిక సదుపాయాల అభివృద్ధి,గ్రామీణ ప్రజల్లో పరివర్తన మంత్రిత్వ శాఖ తెలిపింది అన్నారు. ఎంజీనరేగా నుంచి కొత్త విధానానికి మారే ప్రక్రియలో కార్మికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది అన్నారు. కొత్త గ్రామీణ రోజ్ గార్ గ్యారెంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఇ-కేవైసీ ఎంజీనరేగా కార్డులే చెల్లుబాటులో ఉంటాయి అన్నారు.జాబ్ కార్డు లేని కార్మికులు గ్రామపంచాయతీ నందు నమోదు చేసుకోవాలని సూచించారు.వేతనాలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలోకి బదిలీ అవుతాయి అన్నారు.గ్రామంలో ప్రధాన చెరువుల పూడిక మట్టితో నిండిపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండేది కాదు.వాటిని గుర్తించిన పంచాయితీ అధికారులు,ఉపాధి హామీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకొని.దాదాపు 100 మంది పైగా ఉపాధి కూలీలు ఈ పనుల్లో ఉత్సాహంగా చెరువులో పేరుకుపోయిన మట్టిని పనిచేస్తూ తొలగిస్తున్నారు.చెరువుల్లో కూడిక తీయడం వల్ల రానున్న వర్షకాలంలో నీటి నిల్వ సమర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.దీనివల్ల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు వృద్ధిచెంధి,తాగునీటి సమస్య తీరడంతో పాటు పంటలకు జంతువులకు పుష్పలంగా నీరు అందుతుందని అన్నారు.స్థానిక కూలీలకు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా వారి సొంత గ్రామంలో ఉపాధి లభిస్తుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు టి.లక్ష్మి కె.బాలు కె.బాలరాజు ఉపాధి హామీ మెట్లు పి.రామలక్ష్మి టి.సూరిబాబు ఎమ్.సుధీర్ కుమార్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *