అవకతవకలపై నివేదిక వచ్చినంత వరకు ఓపిక పట్టండి. పిఎసిఎస్ చైర్మన్లు

* పలాస మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ పై ఘాటు వాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ మే 24 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. మాజీ పి ఎ సి ఎస్ చైర్మన్ దువ్వాడ శ్రీధర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పలాస నియోజకవర్గం పిఎసిఎస్ చైర్మన్లు సంయుక్తంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. మందస పిఎసిఎస్ చైర్మన్ తమిరియా భాస్కర్ మాట్లాడుతూ గతంలో పలాస పిఎసిఎస్ లో జరిగిన విధుల దుర్వినియోగంపై ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడిన అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా వ్యవస్థలో జరిగిన అంశాలపై మాత్రమే స్పందించారని తెలిపారు. మద్యం ధరలు, వ్యాపారాలకు ఎమ్మెల్యే కుటుంబాన్ని అనుసంధానం చేయడం ఆధారరహితమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కొనసాగుతోందని అన్నారు. స్థానికత పేరుతో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణేతలని పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు పిఎసిఎస్ చైర్మన్ కణితి సురేష్ చౌదరి మాట్లాడుతూ పలాస పిఎసిఎస్ లో 2005 నుండి 2024 వరకు జరిగిన వ్యవహారాలపై విచారణ కోరిన నేపథ్యంలో కొందరు రాజకీయ కోణంలో స్పందిస్తున్నారని అన్నారు. విచారణ జరిగి వాస్తవాలు బయటకు వస్తే అందరూ అంగీకరించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అంశాలను ప్రస్తుత ప్రభుత్వంపై మళ్లించే ప్రయత్నం తగదన్నారు. మువ్వల నాగేష్ ఘటన వంటి అంశాలపై గత పాలకులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి విషయానికి వస్తే నియోజకవర్గంలో కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, విద్య, సాగునీరు, రవాణా రంగాల్లో పనులు ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. స్థానికతపై విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గౌతు కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ఆ కుటుంబం దశాబ్దాలుగా ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించుకుందని, ప్రజాభిమానం వల్లే ఎన్నికల్లో మద్దతు లభిస్తోందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యల కంటే అభివృద్ధిపై చర్చ జరగాలని సూచించారు.బాలిగాం పి ఎ సి ఎస్ చైర్మన్ లబ్బ రుద్రయ్య మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలతో రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు. పలాస నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న నాయకత్వంపై అసత్య ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. పలాస పిఎసిఎస్ లో అవకతవకలు జరిగాయా లేదా అన్నది అధికారిక విచారణ ద్వారా బయటకు వస్తుందని, ముందుగానే ఉలిక్కిపడి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ప్రశాంత వాతావరణం ఉందని, అభివృద్ధి పనులే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. పలాస పిఎసిఎస్ చైర్మన్ వంకల కుర్మారావు మాట్లాడుతూ మాజీ పిఎసిఎస్ లు కొందరు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎంక్వైరీ పూర్తయ్యాక నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. రెండు సంవత్సరాల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలే చూస్తున్నారని తెలిపారు. ప్రజా సేవ ముఖ్యం గతం నుండి ఇప్పటివరకు జరిగిన కార్యకలాపాలపై ఆడిట్, విచారణ ప్రకారం వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. పలాస పిఎసిఎస్ కు సంబంధించిన అంశాలు విచారణలో ఉన్నందున అధికారిక నివేదిక వెలువడే వరకు శ్రీధర్ ఓపిక పట్టాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *