కరటంపాడులో జనగణన సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో బి.పావని

పయనించే సూర్యుడు మే 31 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు ఆర్డీవో బి. పావని కరటంపాడు గ్రామంలో జనగణన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా జనగణన నమోదు సమయంలో ఖాళీ ఇళ్లు, తాళం వేసి ఉన్న ఇళ్ల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి సమాచారాన్ని సమగ్రంగా సేకరించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని ఆర్డీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *