ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు 2.31 లక్షల సొత్తు రికవరీ

పయనించే సూర్యుడు మే 31 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు సర్కిల్ పరిధిలో మొత్తం 19 ట్రాన్స్ఫార్మర్ల ను పగలగొట్టి దొంగతనం కు పాల్పడిన నలుగురు దొంగల ముఠా ను ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ దొంగతనం గురించి ఆత్మకూరు సిఐ గంగాధర్ వివరించారు. ఆత్మకూరు సమీపంలో అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న ఈ నలుగురిని పట్టుకున్నామని వీరు గతంలో ఆరు మండలాలలో దొంగతనాలకు పాల్పడి 19 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి చోరీకి పాల్పడిన్నట్లు తెలిపారు. ఈ 19 ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టిన చోరీలో నష్టం 2,43,000 కాగా అందునుండి 2,31,000 సొత్తును పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగలను పట్టుకోడానికి సహకరించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ గంగాధర్ తో పాటు ఆత్మకూరు ఎస్సై జంపాని కుమార్, ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *