సమస్యల వలయములో మండగిరి పంచాయతీ..వెల్లాల

పయనించే సూర్యుడు మే 26 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్. ఆదోని పట్టణానికి అనుసంధానం అయిన మండగిరి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతి ఎస్టేట్ కాలనీలో సమస్యలు తాండవం చేస్తున్నాయని పరిష్కారం కోసం ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని బిజెపి నాయకులు మధుసూదన శర్మ తెలిపారు.అందువల్లనే ఈరోజు స్పందన కార్యక్రమములో సబ్ కలెక్టర్ కార్యాలయములోని ఏఓ కె.వసుంధర కి మండగిరి పంచాయతీలో ఆవుదూడ వంక పూడిక తీయడం లేదని, త్రాగునీరు కి బదులుగా మురికి నీరు సరఫరా చేస్తున్నారని అలాగే రోడ్లు, డ్రైనేజీలు శుభ్రపరచడం లేదనే వివిధ రకాల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేయడం జరిగిందని మధుసూదన శర్మ తెలిపారు.అక్కడే ఉన్న డిఎల్పిఓ ని పిలిచి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు నాగేష్, దుర్గాప్రసాద్, మహేష్ నాయక్, నాగేంద్ర మొదలైన వారు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *