పయనించే. సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 26 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండల కేంద్రమైన క్షీరసాగర్ గ్రామంలో శనివారం గజ్వేల్ ఏసీపీ నర్సింలు పర్యవేక్షణలో ట్రైనీ అధికారిణి ఆయేషా ఫాతిమా ఐపిఎస్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బలగాలతో ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏసీపీ గజ్వేల్, 4 గురు సీఐలు, 9 మంది ఎస్ఐలు మరియు 111 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం సిబ్బందిని 9 ప్రత్యేక బృందాలుగా విభజించి, గ్రామంలోని 180 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఔటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్, కటాఫ్ పార్టీలు హోల్డింగ్ టీమ్లను ప్రత్యేకంగా రంగంలోకి దించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వివరాలు సరైన పాత్రలు లేని 20 బైకులు, వాహనాలను, బెల్ట్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 46 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి నర్సింలు మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులకు, అనుమానాస్పదంగా ఉండే నూతన వ్యక్తులకు ఎలాంటి గుర్తింపు కార్డులు పూర్తి వివరాలు లేకుండా ఇళ్లను అద్దెకు ఇవ్వకూడదనీ సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి. గ్రామంలో ఎవరైనా ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలనీ తెలియజేశారు. గ్రామంలో భద్రత పెంచడానికి, నేరాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వీధుల్లో, కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన పత్రాలతో ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. గ్రామంలో శాంతియుత వాతావరణానికి, నేర రహిత సమాజ స్థాపనకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.