పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 31.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// జై భీమ్ మా గురువర్యులు సుమిత్ర రమణా వారు మరియు సుమిత్ర వారు చౌడేపల్లి మండలం వారి స్వగ్రామం బత్తలాపురం నందు ఒక మంచి కార్యక్రమానికి శుభం పలికినారు వారి వారికి వారి కుటుంబ సభ్యులకు జై భీములు తెలుపుతున్నాను. సుమిత్ర రమణవారు కింద స్థాయి నుండి చదువుకొని ఉద్యోగం సంపాదించి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒకపక్క తన కుటుంబ సభ్యులను చదివించుకుంటూ మరోపక్క ఉద్యోగం చేసుకుంటూ అలాగే బుద్ధ, పూలే, అంబేద్కర్ గారి ఆలోచనలతో వారి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూమాలాంటి వారిని మహాపురుషుల అడుగుజాడల్లో, నడవాలని మాలాంటి వాళ్లకు దారి చూపుతూ, నిన్నటి దినం వారి స్వగ్రామమైన బ తాలాపురంనందు పదవ తరగతి లో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు, వారి యొక్క విద్య అభివృద్ధికి తోడ్పాటుగా కొంత ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది. నిజంగా ఈ విషయం గర్వించదగ్గ విషయం ఎందుకంటే అందరికీ ఆలోచన వస్తుంది కానీ కొంతమంది ఆలోచనలను ఆచరణలో పెట్టి చూపుతున్నారు . అలాంటి వారిలో మా గురువు ఉండటం మాకు గర్వకారణం, జై భీమ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *