రంగారెడ్డి గూడెంలో విషాదం _ గుండెపోటుతో దళిత యువకుడు రమేష్ అకాల మృతి

* ప్రభుత్వం స్పందించి, రమేష్ కుటుంబానికి 'ఇందిరమ్మ బీమా' వర్తింపజేయాలి _బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గుడిసె బాలయ్య ముదిరాజ్

పయనించే సూర్యుడు జూన్ 01 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన దళిత యువకుడు కొమ్ము రమేష్ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నిద్రిస్తున్న సమయంలోనే రమేష్ గుండెపోటుకు గురై కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పేద దళిత కుటుంబానికి చెందిన రమేష్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు కలిగించింది. మృతుడికి భార్య, నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రమేష్ అకాల మరణంతో అతని కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డారు. గ్రామంలో అందరితోనూ కలివిడిగా ఉండే రమేష్ మృతి స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సమాచారం తెలుసుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గుడిసె బాలయ్య ముదిరాజ్ వెంటనే రంగారెడ్డి గూడెం చేరుకుని, రమేష్ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా గుడిసె బాలయ్య ముదిరాజ్ మాట్లాడుతూ “చిన్న వయస్సులోనే రమేష్ మరణించడం చాలా బాధాకరం. నలుగురు చిన్నపిల్లలతో అతని కుటుంబం ప్రస్తుతం వీధిన పడింది. ప్రభుత్వం స్పందించి, రమేష్ కుటుంబానికి ‘ఇందిరమ్మ బీమా’ వర్తింపజేయాలి. తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *