తిర్మలాపూర్‌లో జంగయ్య మృతికి సంతాపం _కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన అభిమన్యు రెడ్డి

పయనించే సూర్యుడు జూన్ 01 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కమ్మదనం జంగయ్య (54) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల బిఆర్‌ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జంగయ్య కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 5,000 ఆర్థిక సాయాన్ని ఆయన తన యువసేన సభ్యుల ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, బిఆర్‌ఎస్ మండల యూత్ వింగ్ అధ్యక్షులు బంగారి సంతోష వెంకటేష్, డిప్యూటీ సర్పంచ్ మంత్రి రామచందర్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, అభిమన్యు యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *