ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో “అమ్మ పేరుతో ఒక మొక్క”

తోవి నాగార్జున బీజేపీ ఆదోని టౌన్ సెంట్రల్ అధ్యక్షులు

పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని రూరల్ రిపోర్టర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని బీజేపీ ఆదోని పట్టణ సెంట్రల్ మండల అధ్యక్షులు తోవి నాగార్జున ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 37వ వార్డులోని జమ్మి మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద, పైకోట్టలు ప్రాంతంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద, రాయనగర్‌లోని బాలాంజనేయ స్వామి దేవాలయం వద్ద మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మెన్ కునిగిరి నీలకంఠ పాల్గొని బీజేపీ ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమం సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ప్రధాన కార్యదర్శిలు రమేష్ ఆచారి ప్రశాంత్ కుమార్ కార్యదర్శి శివరామ్ సెంట్రల్ ఎస్సీ మోర్చ అధ్యక్షులు జితేంద్ర కుమార్ , బీజేపీ నాయకులు గోవింద్ బాబు రావు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *