గ్రామ దీపికల సమస్యలనుపరిష్కరించాలి

పయనించే సూర్యుడు న్యూస్ :మే 26,తల్లాడ రిపోర్టర్ గ్రామ అభివృద్ధిలో పాటుపడే’ గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న గ్రామీణ మహిళల అభివృద్ధిలోక్రియాశీలక పాత్ర పోషిస్తున్న మహిళలను చైతన్యవంతం చేసేడ్వాక్రా సంఘాల గ్రామ దీపికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దీక్షాశివరాన్ని తల్లాడ పట్టణంలో ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ టి యు సి ఐ నాయకులు సందర్శించి వారి సమ్మెకు సంఘీభావం ప్రకటించడం జరిగింది

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా టి యు సి ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు మాట్లాడుతూఅతి తక్కువ వేతనంతో పని చేస్తున్న గ్రామ దీపికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు వైఖరిని అవలంబిస్తుందని వేతనాలు పెంచకపోవడంతో పాటు శ్రమదోపిడికి గురిచేస్తున్నారని వారి యొక్క శ్రమ ని దోసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాదిమంది గ్రామ దీపికలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవటం వారి శ్రమని గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేశారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలను పెంచాలని హెల్త్ పాలసీలు అమలు చేయాలని సీనియారిటీ ప్రాతిపదిక మీద సీనియర్ గ్రామ దీపికలను సీసీలుగా గుర్తించాలని హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలని గౌరవ వేతనం కాకుండా వారికి కనీస వేతనం 20000 మంజూరు చేయాలని గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారుప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామ దీపికల యొక్క సమస్యలు పరిష్కరించేంతవరకు తమ న్యాయమైన డిమాండ్లను అమలు అయ్యేంతవరకు ఉద్యమించాలని ఆ ఉద్యమానికి టి యు సి ఐ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంపూర్ణ మద్దతును సంఘీభావాన్ని తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ దీపి కుల మండల అధ్యక్షురాలు డి సుజాత ప్రధాన కార్యదర్శిసిహెచ్ జయలక్ష్మి కోశాధికారి సిహెచ్ కళావతి ఉపాధ్యక్షురాలు కే విజయలక్ష్మి సహాయ కార్యదర్శి ఎన్ అనసూయ పి నాగ ప్రసన్న కె వెంకట కృష్ణమ్మ ఆమని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *