పయనించే సూర్యుడు, మే 26 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గంపహాడ్ మండలం, మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సారపాక కు చెందిన వంటశాల నర్మద కు రూ 8,000/- ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.ఈమె భర్త ప్రభాకర్ స్థానిక ఐటిసి కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు.వీరికి 5 సంవత్సరములు ,18 నెలల వయస్సు కలిగిన ఇద్దరూ ఆడ పిల్లలు వున్నారు.వీరి స్వస్థలం పాల్వంచ మండలం దంతెలబోరు కాగా ఉపాది కోసం సారపాక వచ్చి అద్దె ఇంట్లో నివాసం వుంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు.పేద కుటుంబం కావడం వలన ఆర్దికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రభాకర్ కు వచ్చే సంపాదనతోనే భార్య ,పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.కానీ విధి వారిని చిన్న చూపు చూడటంతో ఇటివల జరిగిన ప్రమాదంలో నర్మద కు రెండు కాళ్ళు ,చాతి పక్కటెముకలు విరిగి పోవడంతో మంచానికే పరిమితమైనది.ఈ విషయం నేస్తం ట్రస్ట్ దృష్టికి రావడంతో సోమవారం వారి ఇంటి వద్దకు వెళ్లి నర్మద ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండా రెడ్డి మాట్లాడుతూ ప్రభాకర్ కుటుంబ దయనీయ పరిస్థితిని చూసి కొంతమంది దాతలు ముందుకు వచ్చి అందించిన ఆర్దికంగా సహాయం తో పాటు ,అతను మరికొంత అప్పు చేసి భార్య నర్మద కు వైద్యం చేయించాడు,అయినప్పటికీ ఆమె కు పూర్తిగా కోలుకోవాలంటే సుమారుగా 5 నుండి 6 నెలలు సమయం పట్టవచ్చని వైద్యులు చెప్పడంతో వైద్య ఖర్చులకు మరియు కుటుంబ పోషణకు ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.ఇద్దరూ చిన్నారుల తో సంతోషంగా ఉన్న వారి కుటుంబంలో ఒక్కసారిగా నర్మద ప్రమాదానికి గురికావడం వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది .ప్రభాకర్ ఆర్దిక ఇబ్బంది,నర్మద పడుతున్నా మానసిక,శారీరక వేదన తమకు ఎంతో భాద కలిగించిందని, వారి కుటుంబానికి నేస్తం ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపి రూ8,000/- ఆర్దిక సహాయం అందించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింత అంకిరెడ్డి,గౌరవ సలహాదారులు సంకా సురేష్ ,సభ్యులు దుగ్గిరెడ్డి బాలనారాయణ రెడ్డి ,సోము రఘునాధ రెడ్డి ,జింకల రాంగోపాల్ రెడ్డి ,కైపు రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.