శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..అధ్యక్ష కార్యదర్శులుగా రమణమూర్తి, డి కే వరప్రసాద్ లు ..సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తాం నూతన కమిటీ సభ్యులు..

పయనించే సూర్యుడు మే 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం,ఆధ్వర్యంలో ఆదివారం బ్రాహ్మణ భవన్ లో సంఘ సర్వ సభ్య సమావేశం, మరియు ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక విజయవంతంగా, నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి డీకే వరప్రసాద్ మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ,సభ్యులు అందరూ అధిక సంఖ్యలో, హాజరై కమిటీ వారికి పూర్తిగా సహకరించడం జరిగింది. సభకి వచ్చినవారికి, ఎయిర్ కూలర్ ఏర్పాటుచేయడం, మజ్జిగ, చల్లని మంచి నీరు,ఫలహారం తదితర.ఏర్పాట్లు ఘనంగా చేసామని తెలిపారు. రాబోవు రోజుల్లో,సంఘ సంక్షేమ కార్యక్రమాలు,మరియు పేద విద్యార్థులకి,ఎవరికైనా ప్రమాదాలు జరిగిన సందర్భంలో,వారి కుటుంబానికి ఆర్థిక సహాయం,పూజలు,నోముల చేసుకొనే వాటికి ప్రోత్సాహం తెలుపుతూ,కొత్త కమిటీలో నలుగురు కొత్తవారికి అవకాశం ఇస్తూ,ఏకగ్రీవంగా అందరి హర్షధ్వానాల మధ్య కార్యక్రమం జరిగింది. శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులుగా పీవీడి దుర్గాప్రసాద్, అధ్యక్షులుగా సిహెచ్ ఎస్వి రమణమూర్తి, ఉపాధ్యక్షులుగా కే గౌరీ శంకర్, కార్యదర్శిగా డీకే వరప్రసాద్, కోశాధికారిగా ఎస్ వెంకటరత్నం, జాయింట్ సెక్రెటరీ టీవీ సుబ్బారావు అలాగే మెంబర్స్ గా వి నాగేశ్వరరావు బిఎస్ శ్రీనివాస్ కే గవరరాజు టీవీ శాస్త్రి మరియు శ్రీమతి చెరుకూరి పద్మావతి , వెల్లంకి ప్రసాద్ శర్మలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే సంఘానికి సంబంధించి కోశాధికారి అయిన ఎస్ వెంకటరత్నం ఎప్పటికప్పుడు ఖర్చులకు సంబంధించి అన్ని విషయాలు తెలియజేస్తారని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *