ఈటెల రాజేందర్‌పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన నాయకుడిపై బురదజల్లే కుట్రలను ప్రజలు ఎప్పటికీ నమ్మరు

పయనించే సూర్యుడు జూన్ 2(మేడ్చల్ నియోజకవర్గం మాధవరెడ్డి ) ఈటెల రాజేందర్ ఒక పేరు కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని విశ్వాసం బురదజల్లే ప్రయత్నాలు ఎన్నైనా కావచ్చు ప్రజల ప్రేమ ముందు అవన్నీ బలాదూర్ మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటెల రాజేందర్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ప్రజానాయకుడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను ప్రజల కోసం సాగించిన పోరాటాలను ఎవరూ చెరిపివేయలేరని అన్నారు.ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే నాయకుడిగా, అర్ధరాత్రి అయినా ప్రజల సమస్యలకు స్పందించే వ్యక్తిగా ఈటెల రాజేందర్ గారు ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. హుజూరాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు ప్రజలు ఆయనకు అందించిన అపారమైన ఆదరణ, విశ్వాసమే ఆయన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.కొంతమంది రాజకీయ అసూయతో, వ్యక్తిగత ద్వేషంతో, పార్టీని బలహీనపరిచే ఉద్దేశంతో ఈటెల రాజేందర్ గారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అయితే అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలతో ప్రజల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించలేరని స్పష్టం చేశారు.సూర్యుడిపై ఉమ్మేస్తే అది తిరిగి మన ముఖంపైనే పడుతుంది” అన్నట్లుగా, ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడిపై బురదజల్లే ప్రయత్నాలు చేసే వారే ప్రజల ముందు బట్టబయలవుతారని అన్నారు.ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీని బలోపేతం చేయాలంటే నాయకులను టార్గెట్ చేసే రాజకీయాలు కాకుండా, అందరినీ కలుపుకొని ముందుకు సాగే రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు.ఈటెల రాజేందర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంపూర్ణ మద్దతుగా నిలవాలని, నాయకత్వాన్ని కాపాడినప్పుడే పార్టీ మరింత బలపడుతుందని, పార్టీ బలపడితే తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *