భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏ ఐ టి యు సి

పయనించే సూర్యుడు: జూన్ :2/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్:గద్దె. విజయబాబు 60 సంవత్సరాలు పూర్తి అయిన కార్మికులకు పింఛన్ అందజేయాలి: రామకృష్ణ గంగారం: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నిమ్మటూరీ రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామంలో జరిగిన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల కొరకు ఆన్లైన్ చేసే సందర్భంలో సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయకపోవడం వలన మీ-సేవల చుట్టూ కార్మికుల పని మానేసి తిరగటం సరిపోతుందని, ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ సంక్షేమ బోర్డు నందు ఆన్లైన్ ప్రాబ్లం సరి చేయాలని, ఈ సందర్భంగా రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సంక్షేమ పథకాల నిధులు గత మూడు నెలలుగా అప్లోడ్ అయిన కార్మికుల ఖాతాలో డబ్బులు జమకాలేదని తక్షణమే డబ్బులు కార్మికుల ఖాతాలో పడేవిధంగా చూడాలన్నారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి కనీస పింఛను 6000 రూపాయలు ఇవ్వాలని సందర్భంగా కోరారు. అలాగే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు చేతులు వేళ్ళు అరిగిపోయి తమ్ము తీసుకోవట్లేదని తక్షణమే తమ సిస్టం ఎత్తివేయాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు అలాగే కార్మికుల అడ్డాల వద్ద కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఈ సంవత్సరం కల్పించలేదని ఇంత ధ్యానస్థితిలో కార్మిక శాఖ ఉందా అని ప్రశ్నించారు తక్షణమే ఎప్పటికైనా అడ్డాల వద్ద సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కంచి శ్రీనివాసరావు గంగారం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సంఘం అధ్యక్షులు కనపర్తి మాల్యాద్రి. ప్రధాన కార్యదర్శి. శ్రీనివాసరావు. షేక్ కసుమూరు వలి. మన్మధరావు. జోసప్ప. వెంకటేశ్వరరావు. తాటి శీను. పుల్లారావు. గురవయ్య. ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *