పయనించే సూర్యుడు జూన్ 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్నగర్ నియోజకవర్గం గంట్లవెల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ వరకు చదివిన ఓ విద్యార్థిని ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 831వ ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఫరూక్‌నగర్ మండలం దేవునిబండ తండాకు చెందిన బాదావత్ అఖిల, వ్యవసాయ కూలీలైన బాదావత్ విజయ, (క్రీ,శే)గోపాల్ నాయక్ కుమార్తె. ఆమె 5వ తరగతి వరకు గంట్లవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివి, అనంతరం మొగిలిగిద్ద కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యను కొనసాగించింది. కష్టపడి చదువుతూ ఐఐటీ ప్రవేశ పరీక్ష రాశిన అఖిల ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా 831వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. దేవుని బండ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ మూడవత్ శ్రీను మాట్లాడుతూ.. అఖిల సాధించిన ర్యాంక్ ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రేరణగా నిలుస్తుందని సర్పంచ్ శ్రీను అన్నారు. అఖిలకు , గ్రామ ఉప సర్పంచ్ బాదావత్ శ్యామ్ లాల్ పి రాందాస్ నాయక్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు,