సినిమా నాటక టెలివిజన్ రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా ఆంద్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరతభూషన్ ..

పయనించే సూర్యుడు జూన్ 2, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ మెయిన్ రోడ్ లో గల టౌన్ హాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారి కాకినాడ విచ్చేసిన ఎఫ్.డి.సి. చైర్మన్ పి.భరత్ భూషన్ అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. కోణిదెల రాజశేఖర్, బొప్పన సాంబశివరావు, కొడాలి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్.డి.సి. చైర్మన్ పి.భరత్ భూషణ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ముఖ్యఅతిధి భరతభూషను మార్ని జానకిరామచౌదరి సభకు పరిచయం చేసారు. ఈసందర్భంగా నాయకులు డా॥నెక్కంటి నగేష్, బొప్పన సాంభ శివరావు, నెక్కంటి శ్రీనివాస్ తో పాటు పలువురు నగర ప్రముఖులు భరతభ్భూషణ్కు ఎఫ్.డి.సి. చైర్మన్ పదవీ రావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం భరతభ్భూషణ్కు భారీ గజ మాల, పూలమాలలు వేసి సాలువాలు కప్పి పుష్పాగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన సి.ఎం. చంద్రబాబునాయు డు, డిప్యూటి సి.ఎం. పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, నందమూరి బాలకృష్ణ లకు కృతజ్ఞతలు తెలియజేసారు. భవిష్యత్ లో పెద్దలు కొరుకున్నట్లు కాకినాడ నగరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో డా॥నెక్కంటి నగేష్, పద్మరాజు, నెక్కంటి శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, గన్ని సత్యనారాయణచౌదరి గాపాటి రాయుడు, పలువురు నగర ప్రముఖులు భరత్ భూషణ్ మిత్ర బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *