బోటు క్లబ్ ఉద్యానవనం లో*ఘనంగా హ్యాపీ సండే..

పయనించే సూర్యుడు జూన్ 2, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు బోటుక్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆనంద స్థాయిలు మెరుగుపరచి ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం’ హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బహుముఖ ప్రజ్ఞావంతుడు వేదల శ్రీకృష్ణ ఫణీంద్ర ప్రదర్శించిన జానపద నృత్యం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం సంగీత విభావరి జరిగింది. గాయకులు వి. ప్రభాకర్ రావు, జి .శివకుమార్ ప్రభృతులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వాకర్స సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *