20, 3, 4,వ వార్డులో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మెట్‌పల్లి, జూన్ 02 మెట్‌పల్లి పట్టణంలోని వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక వార్డులలో కౌన్సిలర్స్ హాజరై, కాలనీకి చెందిన మహిళలకు తన చేతుల మీదుగా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ 20వార్డ్ మాసుల ప్రవీణ్ 3వార్డ్ బత్తుల నరేష్, 4వార్డ్ పందిరి రమేష్, మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. వార్డు సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరల పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వార్డుకు చెందిన ముఖ్య నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు మరియు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *