తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం పాల్గొన్న బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్‌పల్లి జూన్ 3 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు జరిగిన ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చురుగ్గా పాల్గొన్న మేడిపల్లి గ్రామ ఉద్యమకారులను మంగళవారం బి.ఆర్.ఎస్ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామంలో బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాడు ఉద్యమ కాలంలో ముందుండి నడిచిన మేడిపల్లి బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పింజరి బొర్రయ్య, దూలూరి రాజలింగం లను ఈ సందర్భంగా శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్రావతరణ కోసం వారు చేసిన పోరాటాలు, అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు. నాడు ఉద్యమ సమయంలో అరెస్టులకు, కేసులకు భయపడకుండా స్వరాష్ట్ర సాధనకై పోరాడిన ప్రతి ఒక్కరూ మనకు గర్వకారణం. అని మేడిపల్లి మాజీ సర్పంచ్ పీసు తిరుపతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు గంగాధర్, సురేష్ గౌడ్, రమేష్, శంకర్, జలంధర్ యాదవ్, మనోజ్ గౌడ్, రవి రెడ్డి, శ్రీను రెడ్డి, నవీన్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *