పయనించే సూర్యుడు జూన్ 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామానికి చెందిన ఎండి ఖాతాలు హుస్సేన్ (42) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హుస్సేన్ గత 15 ఏళ్లుగా మంగనూరు గ్రామ పంచాయతీ కారోబార్‌గా సేవలందిస్తున్నారు. ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.