ఇందిరమ్మ గృహాలను ప్రారంభించిన సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,రామగిరి, జూన్ 2 రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సోమవారం 10 ఇందిరమ్మ గృహాలను సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ప్రారంభించారు. ప్రభుత్వం నిర్మించిన ఈ గృహాలను అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించిన నేపథ్యంలో రత్నాపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు సర్పంచ్ తెలిపారు.గ్రామంలో ప్రస్తుతం 97 ఇందిరమ్మ గృహాలు వివిధ దశల్లో నిర్మాణం పూర్తిచేసుకున్నాయని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా 10 గృహాలను స్వయంగా సందర్శించి రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగుల సంతోష్, హౌసింగ్ ఏఈ ఎన్. రేఖ, వార్డు సభ్యులు కెక్కర్ల ఉషా అశోక్, జక్కుల పద్మా చందన్, కలవేన రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భద్రపు శకుంతల, లలిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *