ఉద్యమకారులు మల్లికార్జున శర్మ అధ్యక్షతన బేరి రామచంద్ర యాదవ్ కు,ఉద్యమకారులకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు, జూన్ 02 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి ఉద్యమకారుల సన్మాన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ పోరుబాట చేపట్టిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ తోపాటు ఉద్యమకారులను ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ నాయకులు పొట్ట నరేందర్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో నల్లగండ్ల బ్రిడ్జ్ ఐసిఐసిఐ బ్యాంక్ వద్దగల ఫంక్షన్ హాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులకు ఘనంగా సన్మానించడం జరిగింది. శాలువాలతో ఉద్యమకారులకు మెంమోంటోలతో ప్రతి ఒక్కరికి సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన ఉద్యమకారుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తగిన గౌరవం అందించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం, గుర్తింపు పత్రం ఇవ్వాలని ప్రభుత్వానికి సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వెంకట్ రెడ్డి, మల్లి కార్జున శర్మ నవత రెడ్డి మల్లేష్, ఆర్కే సాయన్న ముది రాజ్, సంతోష్, గోవిందు చారి, నరసింహ చారి, ఉద్యమకారుల గురించి ప్రసంగించి ఉద్యమకారులకు న్యాయం జరగలేదని న్యాయం చేయాలని విన్నవించారు. ముఖ్యంగా పురుషోత్తం యాదవ్ తన సందేశంలో ఏ ప్రభుత్వాలు అయినా ఏ పార్టీ అయినా తెలంగాణను సాధించిన ఉద్యమకారులకు మర్యాదపూర్వకంగా చూస్తూ న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఉద్యమకారులు కొంతమంది 1969 లోనూ 2001 నుండి 2014 వరకు ఉదృత ఉద్యమము చేసి కేసీఆర్ జయశంకర్ నాయకత్వంలో తెలంగాణ సాధించడం జరి గింది 1200 మంది ప్రాణాలను బలి ఇవ్వడమే కా కుండా 1969లో కూడా 370 మంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది . 1949 నుండి 1953 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నిజాం నుండి విముక్తి కావా లని 1969 నుండి 1973 వరకు ఆంధ్ర వాళ్ళ నుండి విముక్తి కావాలని అదేవిధంగా 2001 నుండి 2014 వరకుసు దీర్ఘంగా పోరాటం చేసి ఉదృ తంగా కేసీఆర్, జయశంకర్ నాయకత్వంలో సల హాలతో ఉద్యమించి రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు మతాలకు అన్నింటికీ అతీతంగా పోరాడి తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. నరేందర్ యాదవ్ తన సందేశంలో తెలంగాణ ఉద్యమకారులకున్యాయం జరగలేదు, కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి వేసిన కమిటీ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని సభాముఖంగా కోరుతున్నా మన్నారు. ఈ సందర్భంగా 1969, 2001, 2014 ఉద్యమంలో పాల్గొన్న ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఉద్యమకారులకు న్యాయం చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ సాధించినం దుకు గుర్తింపుగా సంపూర్ణ స్వాతంత్రం కొరకు ఉద్యమించినందుకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో సంతోష్ మిగతా వాళ్ళు కూడా ప్రసంగించారు. అందరు కూడా ఉద్యమకారులకు న్యాయం జరగాలని కోరడం జరిగింది. సామ వెంకట్ రెడ్డి వందన సమర్పణలతో సమావేశం ముగించారు. శేరిలింగంపల్లి ఉద్యమకారులు అందరు పాల్గొని సన్మాన సభను విజయవంతం చేయడం జరిగింది. నరేందర్ యాదవ్ తో పాటు మల్లికార్జున శర్మ, బేరి రామచంద్ర యాదవ్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, ఉద్యమ నాయకురాలు మమత, బాలరాజు, మల్లారెడ్డి, సామ వెంకట్ రెడ్డి, అందెల సత్యనారాయణ యాదవ్, పాశం రాజు యాదవ్, మేకల శ్రీనివాస్ యాదవ్, ఉద్యమ కారులు అందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *