18 కిలోల గంజాయిని పట్టించిన ప్రైవేట్బస్ ట్రావెల్స్ కండక్టర్ కు సన్మానం

పయనించే సూర్యుడు, జూన్ 02 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ సన్మానించిన కుకట్ పల్లి డిసిపి రితిరాజ్ తేది :30-05-2026 నాడు రాత్రి అందాజ 8:00 గంటల సమయమున ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద నుండి ఔరంగాబాద్ కు వెళ్ళుట గురించి షిర్డీకి వెళ్ళుచున్న బస్ లో లగేజి బ్యాగ్ పెట్టుచుండగా అట్టి బస్ కండక్టర్ కు అనుమానం వచ్చి అట్టి బ్యాగ్ లో ఉన్న వస్తువుల గురించి విచారించగా అట్టి వ్యక్తులు సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పారిపోయినారు. అట్టి లగేజి బ్యాగ్ ను కండక్టర్ మియాపూర్ పోలిస్ స్టేషన్ కు తీసుకు వచ్చి ఇట్టి విషయం తెలియపరచగా పోలిస్ వారు పంచుల సమక్షములో పంచనామా నిర్వహించి స్వాధీన చేసుకొని తూకం వేయగా అట్టి గంజాయి సుమారు 18 కిలోలు గా ఉన్నది. ఇట్టి దాని విలువ మార్కెట్ లో సుమారు 20 లక్షల వరకు ఉంటుంది. ఇట్టి విషయములో మియాపూర్ పోలిస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇట్టి గంజాయిని రవాణ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకొనుట గురించి ప్రత్యెక దళాలను ఏర్పాటు చేయనైనది. గంజాయిని పట్టించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కండక్టర్ ను కుకట్ పల్లి DCP శ్రీమతి రితిరాజ్ శాలువా కప్పి సన్మానించి నగదు ప్రోత్సాహం అందించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *