కాట్రేనికోన లో మెడికల్ షాపుల బంద్

పయ నించే సూర్యుడు మే 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో బుధవారంమందుల దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రోగులు మందుల కొనుగోలుకు ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల మెడికల్ షాపులకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త బంద్ పిలుపు మేరకు కాట్రేనికోనలో బుధవారం మందుల దుకాణాలు మూతపడ్డాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కాట్రేనికోన మండలంలోని అన్ని మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అయితే అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారుల ఆదేశాల మేరకు గేటు సెంటర్‌లోని శ్రీ శివసాయి కృష్ణ మెడికల్ షాపును విక్రయాల కోసం కొనసాగిస్తున్నారు. అత్యవసర మందులు అవసరమైన వారు అక్కడ పొందవచ్చని యూనియన్ నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *