తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 3,తల్లాడ రిపోర్టర్ మండల పరిషత్ కార్యాలయం, తల్లాడ ,తేదీ: 02/06/2026 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరువలేం. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలి” అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, రాష్ట్ర ప్రగతికి కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *