ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

* జెండా ఆవిష్కరించిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్... * కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె.వి,వార్డ్ మెంబర్స్,ప్రజలు...

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 3, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ఆవరణలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం రైతు వేదిక,సిపిఎస్ నిమ్మగూడెం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ వాదాన్ని,తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కవులు, గాయకులు, మేధావులు, యువకులు తమకున్న సర్వస్వాన్ని దారపోసి తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రమించారు. ఎందరో ఆత్మ బలిదానాల శ్రమ ఫలితమే ఈనాడు స్వరాష్ట్ర సంకల్పం సహకార మయ్యిందని. అమరుల ఆశయాలను ముందుకు తీసుకు పోయేందుకు ప్రతి ఒక్కరం పరస్పర సహకారంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఉప సర్పంచ్ కె.వి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన అమర వీరుల ఆశయాల సాక్షిగా అన్నారుగూడెం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తామని.ఈ మహా ప్రస్థానంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్లు,పంచాయతీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,బొమ్మ గాని నాదం,గోవిందు శ్రీనివాసరావు(టాక్టర్), ఆపతి వెంకట రామారావు,పులి వెంకట నరసయ్య,మారెళ్ళ దేవేందర్, పేరసాని నరసింహారావు, కందుల నారాయణ, షేక్ హుస్సేన్ బేగ్,తాళ్ల జోసెఫ్,గోవిందు సురేష్, పిన్ని హరీష్,లోకల్ కె.వి,తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, ఇస్నపల్లి శ్రీనివాసరావు, ఇస్నపల్లి గురవయ్య, ఇస్నపల్లి చిన్నకృష్ణ, గొడ్ల వెస్లీజియాన్, గొడ్ల మోసే, గొడ్ల పొన్నం, పంచాయతీ గుమస్తా రమేష్,అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు, మల్టీపర్పస్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *