పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 3 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు,గల్ఫ్ దేశాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు యూఏఈ ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ అన్నారు. మన తెలంగాణ మరింత అభివృద్ధి,సుభిక్షత, సామాజిక న్యాయం ప్రగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను అని రాజాగౌడ్ అన్నారు.గల్ఫ్ దేశాల్లో మరణించిన గల్ఫ్ మృతుల కుటుంబాలకు అందే ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా తొందరగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరియు ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లినటువంటి ఆనాటి ఉద్యమకారులు కళాకారులు వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్నారని వారిని కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు బత్తిని రాజాగౌడ్ తెలిపారు,అనంతరం కార్మికులు రాజగౌడ్ కు ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో బి ప్రమోద్,కే రాజు,పి శ్రీకాంత్,బి వినోద్,వి సందీప్, బినర్సయ్య,రవి కిషోర్,కె ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.