గ్రంధాలయం లో వేసవి విజ్ఞాన శిబిరాలు

పయనించే సూర్యుడు: అనకాపల్లి జిల్లా చోడవరం శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరమునకు బుధవారం విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి కుమార్ రాజు సందర్శించి ప్రతిరోజు గ్రంథాలయమునకు వచ్చి పుస్తకములు న్యూస్ పేపర్లు చదువుతూ విజ్ఞానమును పెంచుకుంటున్న విద్యార్థులను అభినందించారు. అలాగే కొన్ని నీతి కథలు బోధించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల లో కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్చార్జి లైబ్రేరియన్ ఎం ఎస్ ఎల్ జోగేశ్వరి, బి డి సి నిర్వాహకులు మోహన్, నాయుడు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు కు బిస్కెట్ ప్యాకెట్ లు పంపిణీ చేశారు అని లైబ్రరీ యన్ తెలియజేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *