డాక్టర్ అంజి నాయక్ పుట్టినరోజు సందర్భంగా భోజనం ప్యాకెట్లు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 4 (ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు దేవర్ష్ హాస్పిటల్ ఇంచార్జ్ డాక్టర్ అంజి నాయక్ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి డాక్టర్ విజయ,కుటుంబ సభ్యుల సహకారంతో బుధవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ఏలేశ్వరం బ్రాహ్మణ భోజనం హోటల్ బేత శ్రీనివాస్, దోనేపూడి శ్రీను, పొన్నగంటి సత్తిబాబు సహకారంతో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైర్యాల నాగేశ్వరరావు, సభ్యులు ఆధ్వర్యంలో సుమారు 100 మందికి భోజన పొట్లాలు మరియు టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు పెండ్యాల రాజు, మల్లి బాబు, రాజబాబు, దాసరి కృష్ణ, రాజశేఖర్, పిరట్ల రవి, గొల్లపూడి త్రిమూర్తులు, జగన్, కంచర్ల రమేష్, డోర్స్ రమేష్, మెడికల్ షాప్ లక్ష్మణ్, బ్లడ్ టెస్ట్ గణేష్, నీలి పాండురంగ, హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *