పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణం నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్ర రెడ్డి (చల్లా బాబురెడ్డి ) మహిళలతో కలిసి ట్రావెల్స్ బంగ్లా నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 04.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జే. నాగరాజ// మహిళలను గుర్తించి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని మహానాడులో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు వారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు వారికి కూటమినేత పవన్ కళ్యాణ్ వారికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా బాబురెడ్డి ప్రసంగిస్తూ మహిళలకు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు లభించిందని ఆస్తిలో పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు వారిదని మరియు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన ఘనత నారా చంద్రబాబునాయుడు వారిదని మరియు తెలుగుదేశం పార్టీది అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో మహిళలను ప్రోత్సహించేలాగా మరియు రాజకీయ నాయకులుగా తయారు చేసేందుకు 33% రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తుందని కావున మహిళలందరూ ప్రత్యేకంగా గుర్తించి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు వారిని మరియు లోకేష్ బాబు వారిని కూటమినేత పవన్ కళ్యాణ్ వారిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున మహిళలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *