నగరపాలక సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు హర్షనీయం.. అడబాల..

పయనించే సూర్యుడు జూన్ 4, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పచ్చదనం, ఉద్యానవనాల నిర్వహణ, ఇంటింటి వద్ద చెత్త సేకరణ తదితర అంశాలలో ప్రతిభ కనబరిచిన కాకినాడ నగరపాలక సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు లభించడం హర్షనీయమని బోటు క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక బోటు క్లబ్ ఉద్యానవనంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా కమీషనర్, అదనపు కమిషనర్, ఉప కమిషనర్, ఎంహెచ్ఓ తదితర అధికారులు, సిబ్బంది విస్తృతంగా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ గుర్తింపు లభించిందన్నారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులలో కూడా నగరపాలక సంస్థ ఉత్తమ ఫలితాలను సాధిస్తుందన్న విశ్వసాన్ని అడబాల వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *