పయనించే సూర్యుడు: జూన్: 4 /06 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సత్తుపల్లికి తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఇచ్చే ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేసింది. జూన్ ఒకటి నుండి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం ఐఇంది.మొదటి సంవత్సరం విద్యార్థులు కళాశాలలో చేరిన వెంటనే ఉచిత పాఠ్యపుస్తకలు అందజేయడం జరుగుతుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. భాగ్యలక్ష్మి తెలియజేసారు. ఉచిత పాఠ్యపుస్తకాలు అందిచడం వలన ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేసారు.